Wednesday, 4 November 2026

జిల్లా కేంద్రంలో ఉత్సాహభరితంగా తెలంగాణ రన్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూన్ 12.,(జనంసాక్షి). తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ నిర్వహించారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌరస్తా వద్ద కలెక్టర్ అనురాగ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ లు జెండా ఊపి తెలంగాణ రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో దశాబ్ది ఉత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో ఉత్సాహభరితంగా యువకులు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రన్ లో ప్రదర్శించిన ఫ్లాకార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, అదరపు ఎస్పీ చంద్రయ్య, 17వ బెటాలియన్ ఇన్చార్జ్ కమాండెడ్ జయరాజు, అసిస్టెంట్ కమాండెంట్ పార్థసారధి రెడ్డి, జిల్లా యోజన క్రీడా శాఖ అధికారి ఉపేందర్ రావు, సిఐలు అనిల్ కుమార్, ఉపేందర్, మొగిలి, వెంకటేష్ రజనీకాంత్ ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.