Wednesday, 4 November 2026

బాలకార్మిక వ్యవస్థ నిర్ములనపై అవగాహనా సదస్సు… జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రాజేష్ బాబు

నాగర్ కర్నూల్ ఆర్సీ జూన్12(జనంసాక్షి):బాలకార్మిక వ్యవస్థని సమూలంగా నిర్ములిచే భాద్యత మన అందరిపైన ఉన్నది అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రాజేశాబాబు అన్నారు.సోమవారం తెల్కపల్లి మండలం గడ్డంపల్లి మండల పరిషత్ ఉన్నంతపాఠశాల ఆవరణలో”బాలకార్మిక వ్యవస్థ నిర్ములణ”న్యాయవిజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరైనాన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,14సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయించడం చట్టంరిత్యా నేరం దీనికి కారకులుగా తల్లిదండ్రులపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.అంత కాకుండా విద్యార్థులపై ఒత్తిడి లేకుండా మార్కులు గురించి ఎక్కువగా భయపెట్టవద్దు,కావున చిన్న పిల్లల భవిషత్ దృష్టిలో పెట్టుకొని వారిని ప్రతిరోజు పాఠశాలకు పంపగలరని సూచనలు చేయడం జరిగింది.జిల్లా ప్రిన్సిపాల్ సీనియర్ జడ్జి జి.సబిత మాట్లాడుతూ,విద్యార్థులు తమ భవిష్యత్లో సాధించవలసిన లక్ష్యాలు,తల్లిదండ్రుల పాత్రపై అవగాహణ కలిగించారు.MPP కొమ్ము మధు మాట్లాడుతు విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు భాద్యత తీసుకోవాలి అందుకోసం విద్యార్థులను పనికి పంపకుండా క్రమం తప్పకుండ పాఠశాలకు పంపించాలని సూచనలు చేశారు.పాఠశాల పధానోపాధ్యాయులు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ,ఇలాంటి అవగాహన సదస్సులు,జిల్లా న్యామమూర్తుల రాకతో మా విద్యార్థులకు ప్రేరణ కలిగించినది అని అన్నారు.ఈ కార్యక్రమములో సీనియర్,జూనియర్ న్యాయవాదులు,కోర్టు సిబ్బంది కేశరెడ్డి దేవిక,తదితరులు పాల్గొన్నారు.