నెన్నెల, మే 26, (జనంసాక్షి )
నెన్నెల మండలం మన్నెగూడెం గ్రామంలో శుక్రవారం స్థానిక సర్పంచ్ గొర్లపల్లి బాపు కంటివెలుగు కార్యక్రమం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలోని 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఉచితంగా కంటి పరీక్షలు చేసుకొని సమస్యలు ఉన్నవారు ఉచితంగా మందులు, కంటి అద్దాలు పొందాలని సూచించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కంటివెలుగు ప్రారంభించి పేదలకు ఎంతో మేలు చేశారని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో కంటివెలుగు మెడికల్ ఆఫీసర్ భవాని, వైద్య సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మన్నెగూడెంలో కంటివెలుగు ప్రారంభం.




