జిల్లా ప్రధాన వైద్యశాలలో ఓపి సేవల సమయం పెంచాలి
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు చిమ్మని ప్రకాష్.
సిరిసిల్ల. డిసెంబర్ 23. (జనం సాక్షి) జిల్లా ప్రధాన వైద్యశాలలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఓ పి సమయం పెంచాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు చిమ్మని ప్రకాష్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరిండెంట్ మురళీధర్ రావుకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. జిల్లాలో వైద్య సేవలు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వైద్యులు అందుబాటులో సేవలందించేలా చూడాలని సూపరిండెంట్నీ కోరారు. ఓ పి సమయం పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో సభ్యులు గాడి రాంప్రసాద్, బీమని రామచంద్రం పాల్గొన్నారు.




