Saturday, 7 November 2026

నేరస్తులను ఉపేక్షించబోం. -జిల్లా ఎస్పీ మనోహర్

నేరస్తులను ఉపేక్షించబోం.
-జిల్లా ఎస్పీ మనోహర్.
-2022 సంవత్సరం క్రైమ్ నివేదికను వెల్లడించిన ఎస్పీ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్ 23( జనంసాక్షి):

శాంతి భద్రతలను కాపాడడంతోపాటు నేరాలను నివారించేందుకు నేరస్తులను కఠినంగా శిక్షించడంలో ఉపేక్షించేది లేదని,నేరాలు అదుపు చేయడంలో,శాంతి భద్రతల ను కాపాడుటలో ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగడం వల్ల గడిచిన సంవత్సరం ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ మనోహర్ తెలిపారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయ సమావేశ మందిరంలో సంవత్సర క్రైమ్ నివేదికను మీడియాకు వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3770 కేసులను నమోదు చేసినట్లు తెలిపారు.ఈ సంవత్సరంలో 22 హత్య కేసులను నమోదు చేయడం జరిగిందని ఏడు గంజాయి నమోదు చేసి ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్టు వివరించారు.జిల్లాలో 210 చీటింగ్ కేసులను నమోదు చేసినట్లు 54 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసినట్లు ఆయన వివరించారు.19 గేమింగ్ కేసులలో 543 మందికి శిక్ష పడేలా శిక్ష పడినట్లు తెలిపారు. దొంగతనం కేసులలో ఒక కోటి 49 లక్షల 30 వేల 310 రూపాయలు మరియు వస్తువులు అపహరణకు గురికాగా 60 శాతం రికవరీ చేయడం జరిగిందని,జిల్లాలో ఒక రౌడీషీట్ ఓపెన్ చేయడంతో పాటు ఏడు మందిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 337 మహిళలపై వేధింపుల కీర్తనలు నమోదు చేయడం జరిగిందని వీటిలో 63 అత్యాచార కేసులు 43 కిడ్నాప్ కేసులు 221 మహిళలపై వేధింపుల కేసులు ఉన్నాయని వివరించారు.అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న 2004 వాహనాలను సీటు చేసి 182 కేసుల ద్వారా 248 నేరస్తులను అరెస్టు చేయడం జరిగిందని వివరించారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న 86 మంది నేరస్తులను అరెస్టు చేసేందుకు 69 కేసులను నమోదు చేసి1951.68 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగిందని వివరించారు.36 కిలోల నకిలీ విత్తనాలను సీజ్ చేసి ఇరువురి నేరస్తులను అదుపులోకి తీసుకుని ఒక కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో జరిగిన 154 రోడ్డు ప్రమాదాలలో 169 మంది మృతి చెందడం జరిగిందని 106 మంది గాయపడినట్లు తెలిపారు. 330 సైబర్ కేసులను ఫిర్యాదుల ద్వారా స్వీకరించి 75 పిటిషన్లను ఫ్రీజ్ చేయడం జరిగిందని ని 2005 పిటిషన్ దారులు ఆలస్యంగా సంప్రదించడం వల్ల నేరస్తులను గుర్తించడంలో వీలు కాలేదని తెలిపారు.75 పిటిషన్లలో 39 లక్షల 64 వేల 73 రూపాయలను నష్టపోవడం జరిగిందని అందులో 20 లక్షల 91 వేల 250 రూపాయలను నేరస్తుల అకౌంట్లో నుండి ఫ్రీజ్ చేయడం జరిగిందని తెలిపారు. 41 మహిళా వేధింపుల కేసులు నమోదైనట్లు తెలిపారు.ఒక పీడీ యాక్ట్ నమోదు కాగా మోటార్ వెహికల్ చట్టం ప్రకారం 93,551 కేసులలో నాలుగు కోట్ల 82 లక్షల 95 వేల 535 రూపాయలు జరిమానా విధించడం జరిగిందని తెలిపారు డయల్ యువర్ 100 కి ఫిర్యాదులు చేసిన 21 560 ఫిర్యాదులలో 299 కేసులు నమోదు చేయడం జరిగిందని వివరించారు. జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు నేరస్తులను గుర్తించేందుకు కొత్తగా 341 సీసీ కెమెరాలు అమర్చడం జరిగిందని ఇప్పటివరకు జిల్లాలో 16 94 సీసీ కెమెరాలు పనిచేస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వర్ కల్వకుర్తి డిఎస్పి గిరిబాబు అచ్చంపేట డిఎస్పి క్రిష్ణ నాగర్ కర్నూల్ డిఎస్పి మోహన్ కుమార్ స్థానిక ఎస్సై విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.