జనం సాక్షి: డిసెంబర్ 23 కొల్లాపూర్ రూరల్ పెంట్లవెల్లి మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ మరియు యూత్ జోడో బూత్ జోడో కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కొత్తకాపు శివసేన రెడ్డి గారి ఆదేశాల మేరకు కొత్త బస్టాండ్ దగ్గర యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడిదల రాము గారు యువజన కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా కొడిదల రాము మాట్లాడుతూ బూత్ కోఆర్డినేటర్లుగా ఎన్నికైన వారు తప్పనిసరిగా వారం రోజుల్లో పెంట్లవెల్లి మండలం లో ఉన్నటువంటి 20 బూతులలో ప్రతి బూతు నుండి 5 మంది యూత్ కాంగ్రెస్ సభ్యులను చేర్చాలని అన్నారు.ఈ దిశగా మండల,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని,యూత్ కాంగ్రెస్ సభ్యులు గాని బూత్ కోఆర్డినేటర్లకు సహకరించి 20 బూతులలో త్వరగా ఈ కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలని కోరారు పెంట్లవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధుగం నరసింహ్మ యాదవ్ మాట్లాడుతూ పెంట్లవెల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, యూత్ కాంగ్రెస్ కూడా మండలంలో వివిధ సమస్యలపై నిరంతరం పోరాడుతుందని అన్నారు.యూత్ జోడో బూత్ జోడో కార్యక్రమానికి తమ వంతు సహకారం పూర్తిగా అందిస్తామన్నారు.పెంట్లవెల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు భోగ్యం నరసింహ్మ నాయుడు అధ్యక్షతన పెంట్లవెల్లి మండల కేంద్రంలో యూత్ జోడో బూత్ జోడో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయుటకు వన్ బూత్ ఫైవ్ యూత్ అనే నినాదంతో ప్రతి బూతు నుండి ఐదు మంది యువజన కాంగ్రెస్ సభ్యులను విత్ ఐ వై సి అనే యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా అంతకుముందు మండల కేంద్రంలోని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూల్ జిల్లా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడిదల రాము పెంట్లవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధుగం నరసింహ్మ యాదవ్ కొల్లాపూర్ తాలూకా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి ఉదయ్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు బూత్ కోఆర్డినేటర్లుగా రవికుమార్,రాఘవేంద్ర, కురుమూర్తి లను ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో పెంట్లవెల్లి మండల యూత్ కాంగ్రెస్ నాయకులు డిష్ రవి, కురుమూర్తి, చెన్నకేశవులు, సులిగిరి నాగరాజు, గోప్లాపూర్ యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు రాఘవేంద్ర, ఎంగంపల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లు దివాకర్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు రఘు, పోతుల కిరణ్ కుమార్, ఆంజనేయులు, రవి నాయక్, శివ, జయరాం యాదవ్, రాజు, తిరుపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పెంట్లవెల్లి మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ మరియు యూత్ జోడో బూత్ జోడో కార్యక్రమం




