జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూన్ 8 : జిల్లాలో రూ.52 కోట్ల నిధులతో నిర్మించిన జిల్లా సమీకృత భవన సముదాయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్వల్లూక్రాంతిఅధికారులనుఆదేశించారు.గురువారం ఉదయం జిల్లా ఎస్పి , జిల్లా అదనపు కలెక్టర్ మరియు జిల్లా అదికారులందరి తో కలిసి నూతన సమీకృత భవనాన్ని పరిశీలించి అన్ని విభాగాలను తనిఖీ చేసి పూర్తి స్తాయిలో అన్నిఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈనెల 12 వ తేదీన నూతన జిల్లా సమీకృత భవనాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రారంభోత్సవం చేయుచున్నందున సమావేశము హాలు, కలెక్టర్ చాంబర్, ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడే కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాట్లు యాంటి రూమ్ అన్ని కూడా పకడ్బందిగా ఏర్పాట్లు చేయాలనీ, కలెక్టర్ ఛాంబర్ నందు ఇతర ముఖ్య విభాగాలలో పూజ కార్యక్రమాలకు, శీలా పలకాలు ఏర్పాటు , స్వాగత ఏర్పాట్లు నిర్వహించడానికి పూర్తి చేయాలన్నారు. భవనం లోపల రావడానికి రెడ్, గ్రీన్ కార్పెట్లు వేయాలని, మినీ ప్లాంటేషన్ చేయాలనీ, ఇతర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఐ డి ఓ సి భవనానికి ఇరు ప్రక్కల ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ చాంబర్లో కూర్చోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రికార్డు రూమ్ నందు ఎల్ ఇ డి స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రెస్ కు ఏర్పాటు చేయాలని, డిపిఆర్ఓ ని ఆదేశించారు. అలాగే భోజన ఏర్పాట్లు త్రాగునీరు తదితర పనులు పూర్తి చేయాలన్నారు.
అనంతరం ఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ సృజనతో కలిసి పరిశీలించారు. అలాగే హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాములు, కల్లెక్టరేట్ సూపరిండెంట్లు , జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా సమీకృత భవన సముదాయము ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి:కలెక్టర్ వల్లూరు క్రాంతి




