Wednesday, 4 November 2026

మాజీ ఎమ్మెల్యేకు శుభాకాంక్షల వెల్లువ

మల్కాజిగిరి.జనంసాక్షి.జూన్8.మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.పలువురు సీనియర్ నాయకులు పార్టీలకు అతీతంగా ఆనంద్ బాగ్ లోని ఆయన నివాసానికి వెళ్లి పుష్పగు చాలు అందజేసి శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఆయన ప్రధాన అనుచరులు భారీ కేక్ ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ఆయురారోగ్యాలతో ఉండి ప్రజాసేవ చేయాలని కాంక్షించారు.ఆయనఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు.ఈకార్యక్రమంలో ఆసర్ల శ్రీకాంత్,కుద్దూస్,మోహన్ గౌడ్, రజ భాయ్,రమేష్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.