Tuesday, 3 November 2026

జి జి టి వై ఛాంపియన్ ట్రోఫీ అందించిన టిఆర్ఎస్

జి జి టి వై ఛాంపియన్ ట్రోఫీ అందించిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంజయ్*
మెట్ పల్లి టౌన్, నవంబర్ 30, జనం సాక్షి:
మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో గత 20 రోజులుగా
జి జి టి వై ఛాంపియన్ ట్రోఫీ ఆర్గనైజర్ మహమ్మద్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది. దీనిలో భాగంగా ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో లోఖ్మన్ 11, సుల్తాన్ వారియర్స్ జట్లు తలపడగా లోఖ్మాన్ విజయం సాధించింది. విన్నర్ గా నిలిచారు, రన్నర్ గా సుల్తాన్ వారియర్స్ నిలిచింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ ,మహమ్మద్ రజియోద్దీన్, అక్తర్ జానీ విజేతలకు చాంపియన్ ట్రోఫీ అందించారు. ఈ కార్యక్రమంలో ఎం ఏ బారీ, మన్నేఖాన్,అబ్దుల్ రజాక్, మహమ్మద్ అఖిల్ ,ఖాజా అజీమ్ ,మహమ్మద్ జావిద్ ,చాంద్ గఫూర్, ఎండి షకీల్ ,జియా ఉల్ హఖ్, ఎస్ డి మక్బుల్ ,మాజీద్, తదితరులు పాల్గొన్నారు.