వాహనాల బ్యాటరీ చోరీకి పాల్పడుతున్న ముఠా అరెస్ట్ వాహనాల బ్యాటరీ చోరీకి పాల్పడుతున్న ముఠా అరెస్ట్
దేవరుప్పుల,డిసెంబర్ 01(జనం సాక్షి): మండలంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న వాహన బ్యాటరీ దొంగతనాలపై వచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి ఎస్సై రమేష్ మరియు సిబ్బంది గత రెండు,మూడు రోజులుగా బ్యాటరీ దొంగతనాలు జరిగిన ప్రదేశాలను దొంగతనం ఎవరు చేసి ఉంటారనే కోణంలో విచారణ చేపట్టారు.ఈసందర్భంగా మీడియా సమావేశంలో పాలకుర్తి సిఐ విస్వేశ్వర్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలానికి చెందిన కందుకూరు గోపీచంద్, ఊడుగు చరణ్ , సాగా అఖిల్ ఈ ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాలకు,జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రోడ్డుపై పార్కింగ్ చేసిన ఆటోలు,ట్రాక్టర్లు మరియు ఇతర వాహనాల యొక్క బ్యాటరీలను దొంగిలించి వాటిని అమ్ముకున్నట్లయితే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని డబ్బులు పంచుకోని జల్సాలకు చేసుకోవచ్చని..వారి వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవచ్చునని..అందుకు ఒక పథకం ప్రకారం గత కొద్ది రోజులుగా దేవర్పుల మండలంలోని సీతారాంపూర్ ,దేవరుప్పుల,మన్ పహాడ్ గ్రామాలతో పాటు సూర్యపేట జిల్లా, మోత్కూర్ గ్రామంలో* కూడా వీరు దొంగతనాలు చేసి తిరుమలగిరికి చెందిన రావుల శివకుమార్ అనే వ్యక్తికి అమ్ముకునేవారని ఇది ఇలా ఉండగా ఈరోజు ఉదయం ఎస్సై తన సిబ్బందితో కామారెడ్డి గూడెం పెట్రోల్ పంపు వద్ద వాహన తనిఖీ నిర్వహిస్తుండగా పైన తెలిపిన వ్యక్తులు అనుమానస్పదంగా ఒక ఆటోలో ప్రయాణిస్తూ పోలీసు వారిని చూడగానే పారిపోయే ప్రయత్నం చేయగా ఎస్సై ర్రమేష్ సిబ్బంది కలిసి వారిని చాకచక్యంగా పట్టుకొని వారిని విచారించగా పైన తెలిపినట్లుగా వారు నేరాలు చేశామని తెలిపారనివారు ప్రయాణిస్తున్న ఆటోలు వారు దొంగిలించిన ఏడు బ్యాటరీలను కూడా స్వాధీనపరుచుకొని వారిని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించామని..ఇందుమూలంగా దేవర్పుల,పాలకుర్తి, కొడకండ్ల ప్రజలకు మరియు మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞంప్తి ఏమనగా మీరు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఏదైనా సంఘటన ఇలాంటిది జరిగితే వెంటనే డయల్ 100 సేవలను ఉపయోగించుకొని పోలీసు వారి సేవలు పొందాలని ఈ దొంగల ముఠాను పట్టుకున్న ఎస్ఐ ఎం రమేష్,హెడ్ కానిస్టేబుల్ సదయ్య, కానిస్టేబులు యాకూబ్,అశోక్,రాకేష్,లను వెస్ట్ జోన్ డిసిపి సీతారాం సార్ మరియు ఎసిపి వర్ధన్నపేట శ్రీనివాస్ లు ప్రత్యేకంగా అభినందించారని సిఐ విస్వేశ్వర్ తెలిపారు.




