సామాన్యులకే భారంగా మారిన పన్నువిధానం
హైదరాబాద్,మే15(జనం సాక్షి ): కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలు వల్ల వస్తువుల ధరలు తగ్గుతాయని, వ్యాపారులకు ఊరట ఉంటుందని చెప్ఇపన మాటలు అబద్దమని తేలింది. జిఎస్టీతో ఇప్పుడు ప్రతి వస్తువుపైనా గతం కన్నా ఎక్కువ వాత పడుతోంది. దీంతో ధరనలు కూడా అనూహ్యంగా పెరిగాయి. అన్ని రాష్ట్రాలు అమలు చేయడంతో ఇక పన్నుల సరళీకరణ తథ్యమని భావించారు. ప్రజలకు కూడా జిఎస్టీతో మేలు అని భావించారు. జీరో వ్యాపారం కోట్లలో సాగుతోంది. ఇలాంటి వ్యాపారానికి జీఎస్టీ అమలు అడ్డుకట్ట వేస్తుందని అధికారులు వేసిన అంచనా మాత్రం తప్పింది. కొత్త పన్ను అమలు వల్ల చిన్న వ్యాపారులకు ఎలాంటి సమస్యలుండవని చెబుతున్నా, వ్యాపారులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరూ ఎలాగైనా తప్పించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి సిమెంటు,చక్కుర, పప్పులు తదితర సరుకులు పన్ను లేకుండా జిల్లాలకు చేరుతున్నాయి. ఎలాంటి పత్రాలు లేకుండా సరిహద్దులు దాటిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ
దందా కొనసాగుతోంది. సిమెంటుతోపాటు చక్కెర, మంచినూనె, పప్పులు, ఇనుపచువ్వలు, స్టీల్ సామగ్రి, వస్త్రాలు, ఇతర వస్తువులు ఎలాంటి పత్రాలు లేకుండా దిగుమతి చేసుకుంటున్నారు. పలువురు వ్యాపారులు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండానే దుకాణాలు, గోదాంలు లేకుండానే అవి ఉన్నట్లు చూపి కోట్ల దందా చేస్తున్నారు. ప్రధానంగా వంటనూనెలు, స్టీల్ సామగ్రి, వస్త్రాలు, పప్పులు, మసాలలు జీరో దందాలో అధికంగా సాగుతున్నాయి. రూ.20లక్షల వ్యాపారం దాటితే జీఎస్టీ అమలు పరిధిలోకి వ్యాపారులు వస్తారు. టీవోటీ, వ్యాట్ పన్నులు చెల్లించే వ్యాపారులు జీఎస్టీలోకి మారే అవకాశం ఉంది. కేంద్రం వృత్తి పన్ను, తయారీ పన్ను, సెంట్రల్ ఎక్సైజ్ పన్నులు వసూలు చేస్తోంది. అమ్మకం పన్ను చెల్లించాల్సిన వ్యాపారులు ఆదాయం పన్ను చెల్లించడం లేదు. ఆదాయం పన్ను చెల్లిస్తున్న వ్యాపారులు అమ్మకం పన్ను చెల్లించకుండా తప్పుడు లెక్కలు చూపుతున్నారు. జీఎస్టీ అమలు అయితే ఇలాంటి వ్యాపారానికి కూడా అడ్డుకట్ట పడనుందని భావించినా అంతగా ఫలితం రావడం లేదన్న భావన ఉంది.జీఎస్టీ అమలు అయిన తర్వాత కూడా జీరో దందా వ్యాపారం చేసే సదరు వ్యాపారులపై భారీగా జరిమానాలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. అయితే సదరు వ్యాపారులు సైతం ఈ చట్టాల నుంచి తప్పించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
జీఎస్టీ అమలుతో తొలగని సమస్యలు




