Wednesday, 4 November 2026

విద్యుత్ షాక్ తో గేదె మృతి

 

 

 

 

 

 

 

రామగిరి, జనం సాక్షి :విద్యుత్ షాక్ తో గేదె మృతి చెందిన సంఘటన ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో చోటు చేసుకుంది. కల్వ చర్ల గ్రామానికి చెందిన బాధితుడు ఓర్రే హరీష్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి తన ఇంటి దగ్గర గల షెడ్డు లో మేత వేసి కట్టి వేశాడు. షెడ్డు లో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగకు తగిలి విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే గేదె మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ సుమారుగా రూ. 60000 ఉంటుందని బాధితుడు హరీష్ తెలిపారు. బాధితుడిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి కోరారు.