Tuesday, 3 November 2026

ద్విచక్ర వాహనం డి ఇద్దరికీ గాయాలు..

 

 

 

 

 

 

 

 

శంకరపట్నం: జనం సాక్షి మే 30కకరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం జాతీయ రహదారిపై ఓ బాటసారికి ద్విచక్ర వాహనము ఢీ కొట్టి గాయాలైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ ద్విచక్ర వాహనం పై తన కొడుకుతో, హుజురాబాద్ వైపు నుండి స్వగ్రామం ఇప్పల పల్లె వెళుతుండగా మార్గమధ్యలోని కేశవపట్నం శివారులోని, జాతీయ రహదారిపై వాగు సమీపంలో వెనకనుంచి, నడుచుకుంటూ వెళుతున్న చిగురుమామిడి చెందిన నారాయణపురం చంద్రశేఖర్ అనే వ్యక్తిని ఢీకొట్టడంతో చంద్రశేఖర్ కు ద్విచక్ర వాహనం పై ఉన్న బాలునికి గాయాలు కాగా గ్రామస్తులు 108 వాహన సిబ్బంది కి సమాచారం అందించడంతో గాయపడిన వారికి 108 వాహన ఈఎంటి సురేష్ ప్రధమ చికిత్సను అందించి, హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.