Saturday, 7 November 2026

జీవలాజిక్స్ సీడ్స్ వారి కరోనా-99 తో అధిక దిగుబడులు

జీవలాజిక్స్ సీడ్స్ వారి కరోనా-99 తో అధిక దిగుబడులు

-కరోనా-99 సీడ్ పై రైతు క్షేత్ర ప్రదర్శన
-జీవలాజిక్స్ కంపెనీ సైంటిస్టు పుష్కార్

కురివి డిసెంబర్/19: జనం సాక్షి న్యూస్:జీవలాజిక్స్ వారి సీడ్స్ కరోనా-99 అనే సరికొత్త మిరప సీడ్ తో అధిక దిగుబడులు పొందవచ్చని జువాలజిక్స్ వారి హైదరాబాద్ కంపెనీ సైంటిస్ట్ ఎం పుష్కర్ అన్నారు.సోమవారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని హరిదాస్ తండాకు చెందిన రైతు గూగులోత్ రవి వ్యవసాయ భూమిలో 500లకు పైగా రైతులకు రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను సైతం నల్లి,గుబ్బ,ముడుత, తెగులను తట్టుకుని అధిక రోగ నిరోధక శక్తిని కలిగి కాయ మంచి రంగుని, పొడవును కలిగి అధిక దిగుబడిని అందించేందుకు హైబ్రిడ్ మిరపలో సరికొత్త శకానికి నంది పలికిన జీవాలజిక్స్ బయోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి కరోనా-99 సీడ్స్ బాగా ఉపయోగపడుతుందని గుగులోతు రవి పంటను చూపిస్తూ ఆయన వివరించారు. మంచి వితనాలతోనే మంచి దిగుబడి వస్తుందని దేశానికి రాజైన రైతు ఆర్ధికంగా బలపడాలని కోరారు. పంట సాగుపై రైతులకు మిరప సాగుపై తీసుకోవాల్సిన మెళుకువలను వివరించారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కంపెనీ సైంటిస్ట్ పుష్కార్, ఏరియా సేల్స్ మేనేజర్స్ కే శ్రావణ్ కుమార్,పాలిత్య వీరన్న,రైతులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.