హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సినీ నటి జీవిత రాజశేఖర్ ఆఫీస్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఐదు కోట్ల రూపాయల విలువైన పాత నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అన్నీ 500, వెయ్యి నోట్లే. శ్రీనివాస్ అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాతనోట్లు మార్పిడి జరుగుతుందన్న సమాచారం ఆధారంగా ఆఫీస్ పై దాడి చేసింది టాస్క్ ఫోర్స్ టీం. ఈ వ్యవహారంలో జీవిత రాజశేఖర్ ప్రమేయం ఉందా లేదా అనే దానిపై విచారణ చేస్తున్నారు పోలీసులు.




