Thursday, 5 November 2026

హసన్ పర్తి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

హసన్ పర్తి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
హసన్పర్తి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ శరత్ నేత్ర వైద్యశాల వారి సారధ్యంలో నేతాజీ శిశుమందిర్ పాఠశాల యందు వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరానికి కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ ను ఆహ్వానించి వాకర్స్ అసోసియేషన్ వారు ప్రారంభించారు.వైద్య శిభిరాన్ని నిర్వహించిన హసన్‌పర్తి వాకర్స్ వారికి కార్పొరేటర్ కృతజ్ఞతలు తెలిపి ఈ ఉచిత వైద్య శిభిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని వైద్యలతో కంటిచూపు పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహాలు తీసుకోవలసిందిగా కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ తెలియజేసారు.