జీహెచ్‌ఆర్‌ కాలిస్టోను ప్రారంభించిన జీహెచ్‌ఆర్‌ ఇన్‌ఫ్రా

ఖైరతాబాద్ : 30 జూన్‌ (జనం సాక్షి) హైదరాబాద్‌లో అగ్రగామి రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లలో ఒకటైన జీహెచ్‌ఆర్‌ ఇన్‌ఫ్రా గురువారం మరో ప్రీమియం స్మార్ట్‌, సస్టెయినబల్‌ రెసిడెన్షియల్‌ కమ్యూన్‌ జీహెచ్‌ఆర్‌ కాలిస్టోను ప్రారంభించినట్లు జీహెచ్‌ఆర్‌ ఇన్‌ఫ్రా సీఈఓ కార్తీష్‌ రెడ్డి మడ్గుల తెలిపారు. అభివృద్ధి చెందుతున్న వాణిజ్య, గృహ కేంద్రమైన కొల్లూర్‌, తెల్లాపూర్‌ వద్ద ఈ ప్రాజెక్ట్‌ ఉంది. అత్యున్నత గృహ ప్రమాణాలను అందుకునే రీతిలో తీర్చిదిద్దబడిన ఈ ప్రాజెక్ట్‌ ఆధునిక, నూతన తరపు గృహ ఔత్సాహికులను ఆకట్టుకునే రీతిలో ఉంటుందన్నారు. ఈ ప్రోపర్టీలో నాలుగు హై రైజ్‌ టవర్లు ఉంటాయని, ఇవి 11 వింగ్స్‌, 1190 స్మార్ట్‌హోమ్‌లను కలిగి ఉంటాయన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను 8.3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రెరా అనుమతి లభించిందని, డిసెంబర్‌ 2025 నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని నూతన తరపు స్మార్ట్‌ హోమ్‌ కొనుగోలుదారులకు అత్యుత్తమ స్మార్ట్‌ హోమ్‌ అవకాశాలను ఇది అందించనుందని చెప్పారు. జీహెచ్‌ఆర్‌ ఇన్‌ఫ్రా మేనేజింగ్‌ పార్టనర్‌ వి.శ్యామ్‌ సుందర్‌ రెడ్డి మాట్లాడుతూ స్థానిక రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఇది ఖచ్చితంగా విప్లవం తీసుకు వస్తుందని ఆశిస్తున్నామన్నారు.