జుక్కల్ నియోజకవర్గ పరిధిలో మంత్రి హరీష్ రావు పర్యటన
బిచ్కుంద డిసెంబర్ 03 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండల కేంద్రంలో రూ. 10.70 కోట్లతో నిర్మించే 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన మరియు పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్కాంప్లెక్స్ బిచ్కుంద మండలకేంద్రంలో డయాలసిస్ కేంద్రం, డోంగ్లి నూతన మండల తహసిల్దార్ కార్యాలయంను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రివర్యులు హరీష్ రావు ప్రారంభించారు. ఆయనతో పాటు జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే, జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, నియోజక వర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
జుక్కల్ నియోజకవర్గ పరిధిలో మంత్రి హరీష్ రావు పర్యటన




