Thursday, 5 November 2026

విశ్వజ్ఞాన మహోన్నత కీర్తిశిఖరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 14 జనం సాక్షివిశ్వ జ్ఞాన మహోన్నత కీర్తి శిఖరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని వికారాబాద్ జిల్లా జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ వైయస్సార్ తెలంగాణ పార్టీ వికారాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఉప్పరి ప్రసాద్ లు పేర్కొన్నారు శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్132 వ జయంతి* సందర్బంగా ఎమ్మెల్యే నివాస ఆవరణలో అంబేద్కర్ గారి చిత్రపటానికి, అనంతగిరిపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి మరియు రైల్వే స్టేషన్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ స్వరాష్ట్రం సాధ్యమైందని, ఆ మహనీయునికి నివాళిగా తెలంగాణ ప్రాంతం ఎప్పటికీ రుణపడి ఉంటుందని చాటి చెప్పుతూ… దేశంలోనే… ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారి హైదరాబాద్ నడిఒడ్డున 125 అడుగుల అంబేద్కర్*గారి విగ్రహా ఆవిష్కరణ జరగనుందన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరు రాష్ట్ర సచివాలయానికి నామకరణం చేసి, వారి విగ్రహ ఆవిష్కరణ మరియు వారి ఆశయ సాధనలో సంపూర్ణ సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కమల్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ కౌన్సిలర్లు అనంతరెడ్డి గోపాల్ ముదిరాజ్ పుష్పలత రెడ్డి కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి రత్నారెడ్డి కిషన్ నాయక్ వైయస్సార్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఉప్పరి ప్రసాద్ అధికార ప్రతినిధి కావలి వసంత్ కుమార్ యువజన నాయకుడు వేణుగోపాల్ బి ఆర్ఎస్ కాంగ్రెస్ వైయస్సార్ తెలంగాణ పార్టీ బిజెపి సిపిఎం పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.