జుక్కల్, ఎప్రిల్ 13, (జనంసాక్షి)కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలో స్ధానిక తహాసీల్ కార్యాలయం ముందు తహాసీల్దార్ గణేష్ ముస్లీం పేదలకు ప్రభుత్వం తరపున రంజాన్ పండుగ పురస్కరించుకుని గురువారం నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సింగిల్ విండో చైర్మన్ నాగల్ గిద్దే శివానంద్, మండల రైతు బందు అధ్యక్షులు గంగు నాయెక్, మండలపరిషత్ ఉపాధ్యక్షులు ఉమాకాంత్, మండల కో ఆప్షన్ మెంబర్ మోయిన్,నాయకులు నీలు పాటిల్,దాదారావ్ పాటిల్, మైనార్టీ నాయకులు బాబా, అక్తార్ సాబ్, మైబు సాబ్ తదితరులు పాల్గొన్నారు.




