ఇల్లందు జూన్ 29 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జులై 2న ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ జనాగర్జన సభను విజయవంతం చేయాలని ఇల్లందు నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రవి పిలుపునిచ్చారు. గురువారం ఇల్లందు పట్టణంలోని కొత్త బస్టాండ్ ఏరియాలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ నియోజవర్గం పిప్పిరి నుండి భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 1200 కిలోమీటర్ల మేర కొనసాగి ఖమ్మం సభతో ముగుస్తుంది అన్నారు. భట్టి పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందన్నారు. ఆ పాదయాత్రలో గిరిజనుల గోడు, నిరుద్యోగుల బాధలను, రైతుల గోసను భట్టి విక్రమార్క గమనించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలోకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చదువుకున్న నిరుద్యోగులకు 4000 రూపాయల నిరుద్యోగ భృతి, ఇందిరమ్మ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి, ఆరోగ్యశ్రీ కి ఐదు లక్షల రూపాయలు, ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం, 18 సంవత్సరాలు నిండి చదువుకుంటున్న మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటర్, కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి అనుచర గణంతో కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించిందన్నారు. జులై 2న జరిగే జనాగర్జన సభకు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారని అన్నారు. ఈ సభకు ఇల్లందు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు,రైతులు, నిరుద్యోగులు, యువత ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దారావత్ కృష్ణ, బాణాల శ్రీనివాసరావు, బి .ఎన్ .గోపాల్ ,కమలా బాయ్, పసిక తిరుమల్, వరలక్ష్మి , వందన, పాషా, అరవింద్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
జులై 2న ఖమ్మంలో జరిగే జనాగర్జన సభను విజయవంతం చేయoడి కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి రవి పిలుపునిచ్చారు




