Thursday, 5 November 2026

జువ్వాడి కృష్ణారావు దిష్టిబొమ్మ దహనం

మెట్ పల్లి టౌన్,జనవరి19,
జనంసాక్షి
మెట్పల్లి పట్టణంలోని గురువారం రోజున పాత బస్టాండ్ వద్ద జువ్వాడి కృష్ణారావు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన ఆరోపణలపై ఆయన దిష్టిబొమ్మను పాత బస్టాండ్ చౌరస్తా వద్ద టిఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ
7 కోట్ల రూ గురించి ఎమ్మెల్యే పై ఆరోపణ చేయడం అలాగే నిన్న ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేయడం పై తీవ్రంగా ఖండిస్తూ, ఎమ్మెల్యే ఎటువంటి అవినీతికి పాల్పడలేదని ఆయన ప్రజల మనిషిగా ఉంటూ నాలుగు సార్లు ప్రజల మద్దతుతో ప్రేమాభిమానాలతో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని ఆయన పై ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అటువంటి వాఖ్యలు మరోసారి చేస్తే సహించేది లేదని
తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాలకు వచ్చారని,
కానీ ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మనిషిగా వచ్చారని
టిఆర్ఎస్ పార్టీ తరఫున తగిన బుద్ధి చేప్తమని ఎమ్మెల్యే పై కౌన్సిలర్ పై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలని లేని పక్షంలో పాత బస్టాండ్ లో ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేని సుజాత సత్యనారాయణ, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి కో ఆప్షన్ మార్గం గంగాధర్, కౌన్సిలర్స్ ఓజోల బుచ్చిరెడ్డి,లంక గంగాధర్,అంగడి పురుషోత్తం,బంగారు కల కిషోర్,మన్నే ఖాన్ నాయకులు సత్యనారాయణ హనుమాన్లు, అర్జున్, సంజీవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.