జూడో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్‌

జాతీయ స్థాయి క్రీడాకారిని అత్యాచారానికి గురైన దుస్సంఘటన గుర్గావ్‌లోని బిలాస్‌పూర్ లో చోటుచేసుకుంది. క్రీడాకారినిపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్‌గావ్‌కి చెందిన జాతీయస్థాయి జూడో క్రీడాకారిణిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు గుడ్‌గావ్ మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు