Wednesday, 4 November 2026

సౌదీ దౌత్యవేత్త నివాసంలో గ్యాంగ్‌రేప్

pa2n58kwఢిల్లీ శివార్లలోని గుర్గావ్ ఏరియాలో దారుణం జరిగింది. సౌదీ అరేబియాకు చెందిన దౌత్యవేత్త నివాసంలో ఇద్దరు నేపాలీ మహిళలు గ్యాంగ్ రేప్ కు గురయ్యారు. ఇంట్లో పనిచేస్తున్న మహిళలపై సౌదీ దౌత్యవేత్త తన స్నేహితులతో కలిసి గత ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు వెల్లడైంది. అదే ఇంట్లో పనిచేసేందుకు వెళ్లి భయపడి మానేసిన మరో మహిళ ఓ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల బారినుంచి బాధితులను రక్షించారు. విషయం మూడు దేశాలకు సంబంధించినది కావడంతో విదేశాంగ శాఖను సంప్రదించి దర్యాప్తు మొదలుపెట్టాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *