ప్రజాకవి కాళోజీ నారాయణరావు 101వ జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, సాంస్కృతిక సారథి అధ్యక్షులు రసమయి బాలకిషన్‌తో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారాన్ని అందజేశారు.
కాళోజీ 101వ జయంతి వేడుకలు




