Friday, 6 November 2026

జూడో క్రీడాకారిణి కి సన్మానం

జూడో క్రీడాకారిణి కి సన్మానం
తిరుమలగిరి (సాగర్) అక్టోబర్ 27 (జనంసాక్షి):
జాతీయస్థాయిలో నిర్వహించిన జూడో క్రీడలలో వెండి పతకం సాధించిన మండల వాసి గరికినట్ తండాకు చెందిన రమ్యను, డొక్కల ‌బావి తండాకు చెందిన మండల టిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ నహీమ్ పాషా జువ్వి చెట్టు తండా సర్పంచ్ జ్యోతి శంకర్ నాయక్ తో కలిసి ఘనంగా సన్మానించాడు. ఈ సందర్భంగా నహీం భాషా మాట్లాడుతూ ఈ ప్రాంత వాసి అయిన రమ్య దేశస్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించడ మే కాక ,ఈ గ్రామానికి దేశస్థాయిలో గుర్తింపు తెచ్చినందుకు ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ రహమత్, భగవాన్, నరసింహ, బ్రహ్మచారి, రమేష్ ,వసంత్ ,పవన్ నాయుడు, ఘని తదితరులు పాల్గొన్నారు.