బేతంపూడి సొసైటీ కోఆప్షన్ సభ్యురాలుగా రమణ ఎన్నిక
టేకులపల్లి, అక్టోబర్ 27( జనం సాక్షి ): పిఎసిఎస్ బేతంపూడి సంఘంలో మూడో వార్డు బిసి జనరల్ డైరెక్టర్ గా కోయగూడెం గ్రామానికి చెందిన పెద్ద బోయిన మదనయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది.గురువారం బేతపూడి సొసైటీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారు. సొసైటీ అధ్యక్షులు లక్కినేని సురేందర్ రావు అధ్యక్షతన ఎన్నికల అధికారిగా సీనియర్ ఇన్స్పెక్టర్ కె ఆదినారాయణ పాల్గొనగా డైరెక్టర్ అందరూ కలిసి మృతి చెందిన మదనయ్య భార్య పెద్ద బోయిన రమణ ను కోఆప్షన్ సభ్యురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు కంభంపాటి శ్రీనివాస చౌదరి, సంఘ డైరెక్టర్లు ఏలూరు కోటేశ్వరరావు, బాలాజీ, గుడిపూడి కృష్ణార్జునరావ్ , లక్కినేని శ్యామ్, దోర్నాల విజయ మోహన్ రావు, కుమ్మరి లావణ్య, ఇరపా విజయ, బానోత్ ఇస్తారి, చీమల లక్ష్మీనారాయణ, ఉల్లోజు ఉదయ్, సీఈఓ ప్రేమ చారి, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.




