Friday, 6 November 2026

తల సేమియా వ్యాధి నిర్ధారణకు ప్రత్యేక పరీక్షలు

తల సేమియా వ్యాధి నిర్ధారణకు ప్రత్యేక పరీక్షలు

టేకులపల్లి, అక్టోబర్ 27( జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మండలంలో 12 వారాల నుండి 20 వారాల మధ్యలో ఉన్న గర్భిణీ స్త్రీలకు *తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి నిర్ధారణ కొరకు ప్రత్యేక వైద్య పరీక్షలను గురువారం ప్రారంభించారు. ఈ వైద్య పరీక్షలు కొనసాగుతూ ఉంటాయని మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు, గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించడానికి, పరిశీలించడానికి రాష్ట్ర పరిశీలకుల బృందం డాక్టర్ పవన్ గౌడ్, కౌన్సిలర్ దిగరాజ్ పటేల్, నేషనల్ హెల్త్ మిషన్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ దుర్గ, ఆరోగ్య విస్తరణ అధికారి దేవా హాజరయ్యారు. పుట్టే బిడ్డకు ముందస్తు పరీక్ష నిర్ధారణ కోసం ఇనిస్ట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ కు రక్త నమూనాలను పంపించనున్నట్లు వారు తెలిపారు. మూడు మరియు నాలుగో నెల కలిగిన గర్భిణీ స్త్రీలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ల్యాబ్ టెక్నీషియన్ రక్త నమూనాలు సేకరించి వాటిని తెలంగాణ డయాగ్నస్టిక్ కి పంపి హెచ్ బి ఎల్ సి ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తల సేమియా కి సంబంధించిన జన్యు ఉందా అనే విషయాన్ని పరిశీలించి ఎవరికైనా ఉంటే వారి పిల్లలకు ఈ వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్త కోసం జెనిటిక్ సీక్వెన్సింగ్ లో పిల్లలకు ఎంతవరకు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అనే అంచనా వేసి తద్వారా తగిన జాగ్రత్తలు చికిత్సలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు గుజ్జ విజయ, శకుంతల, పోరండ్ల శ్రీనివాస్, నాగు బండి వెంకటేశ్వర్లు, ల్యాబ్ టెక్నీషియన్,సాజిదా బేగం, ఆశా కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.