జూనియర్ కాలేజీలో రాజ్యాంగ దినోత్సవం.
బెల్లంపల్లి, నవంబర్ 26, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బాలుర ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శనివారం భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులచే ప్రత్యేక ప్రార్థన ప్రవేశికలోని అంశాలను ప్రార్థన పూర్వకంగా ప్రతి విద్యార్థికి అవగాహన అయ్యేటట్లు చదివించి ప్రమాణం చేయించారు. రాజ్యాంగం పట్ల, దేశం పట్ల, తల్లిదండ్రుల పట్ల, అధ్యాపకుల పట్ల గౌరవభావంతో మెలగాలని, అంబేద్కర్ సూచించిన నియమాలను పాటించాలని, ప్రతి పౌరుడు వ్యక్తి గౌరవాన్ని పెంపొందించుకోవాలని కాలేజీ ప్రిన్సిపాల్ అంజయ్య ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పిడి బాబురావు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎడ్ల సోమయ్య, అధ్యాపకులు కృష్ణవేణి, గురు పాదం, కరుణాకర్, లక్ష్మణ్, చంద్రయ్య, ఒకేషనల్ లెక్చరర్ లక్ష్మణ్, గణేష్, చందు, రాజా గౌడ్, నవీన్, నరేష్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో శివప్రసాద్ రాజ్యాంగం అంబేద్కర్ అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు




