Thursday, 5 November 2026

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని వినతి.

 

 

 

నెన్నెల, ఏప్రిల్ 12, (జనంసాక్షి )జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని బుధవారం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎంపీపీ సంతోషం రమాదేవికి వినతి పత్రాన్ని అందజేశారు.నాలుగు సంవత్సరాల ప్రొబేషనరి కాలం పూర్తి అయినందున జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని, ఇట్టి డిమాండ్ ను ప్రభుత్వానికి తెలపాలని వినతి పత్రంలో వివరించారు. లేనట్లయితే ఈనెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కార్యాచరణ చేపడుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సీనియర్ పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.