Thursday, 5 November 2026

బిఆర్ఎస్ పార్టీ బీమా చెక్కులను పంపిణి చెసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

 

 

 

 

 

కామారెడ్డి ప్రతినిధి మే 13(జనంసాక్షి);కామారెడ్డి జిల్లా కెంద్రంలొకామారెడ్డి నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వివిధ ప్రమాదాల్లో మృతిచెందగా వారి కుటుంబాలకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున నలుగురికి 8 లక్షల రూపాయలను చెక్కులను అందజేశారు. అయన స్వగృహంలో వారందరికీ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పార్టీ పరంగా కార్యకర్తలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు 2 లక్షల రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది .పార్టీ పరంగా కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలని ఒక మంచి ఆలోచనతో ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులను పార్టీ చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రమాదంలో చనిపోతే వెంటనే కాగితాలను రెండు నెలల్లో పార్టీ కార్యాలయంలో అందజేయాలని కోరారు. పెద్ద మల్లారెడ్డి కి చెందిన కంఠం బాలయ్య, జంగంపల్లి చెందిన ముడుగుల స్వామి, భిక్కనూరుకు చెందిన భవానిపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి ల మృతిచెందగా మమత పద్మ నర్సవ్వ దివ్య లకు చెక్కులను అందజేశారు.