నాగర్ కర్నూల్ ఆర్సీ మే 03(జనంసాక్షి):నాగర్ కర్నూల్ మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న డివిజన్ స్థాయి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల 6వ రోజు నిరవదిక దీక్షకు మద్దతు తెలిపిన నాగర్ కర్నూల్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు దెంది.రవీందర్ రెడ్డి.మరియు సర్పంచులు.ఈ సందర్బంగా వాళ్ళు మాట్లాడుతూ మీ దీక్షకు సంపూర్ణ మద్దతు ఇస్తామని,తప్పనిసరిగా మీకు తోడుగా ఉంటామని,ఆర్థికంగా అండగా ఉంటామని భరోసా ఇవ్వటం జరిగింది.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మండల సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి మరియు మండల సర్పంచులు పాల్గొన్నారు.




