Tuesday, 3 November 2026

సహకార సంఘాల బలోపేతంతోనే వ్యవసాయ రంగ అభివృద్ధిరూ. 30 లక్షల వ్యయంతో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోడౌన్లు ప్రారంభం – బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే సహకార సంఘాల అభివృద్ధి – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

 

 

 

 

 

 

 

హుజూర్ నగర్ మే 03(జనం సాక్షి): సహకార సంఘాల బలోపేతంతోనే వ్యవసాయ రంగ అభివృద్ధి చెందుతుందని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం హుజూర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన గోడౌన్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సైదిరెడ్డి విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడాతూ గత ప్రభుత్వాల హయాంలో సహకార సంఘాలు నిర్వీర్యమై ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార సంఘాలను చైతన్యపరిచి అనేక రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతో పాటు ఎరువులు,పురుగుమందులు అందచేయడమే కాక రైతులు తమ పంటను నిల్వ చేసుకునేందుకు సహకార సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున లక్షల రూ.లు బడ్జెట్ కేటాయిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో నేడు సహకార సంఘాలు రైతులకు అండగా నిలుస్తున్నాయన్నారు. సహకార సంఘాలను వాణిజ్యపరంగా కూడా అభివృద్ధి చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రైతులు సహకార సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం సహకార సంఘం డైరెక్టర్లు, చైర్మన్ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శిరీష కొండారెడ్డి, ఎంపీటీసీ ముడెం గోపిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్లు ఊరే రాధాకృష్ణ, కట్ట గోపాలరావు, డిసిసిబి డైరెక్టర్ వేములూరి రంగాచారి, సంఘ డైరెక్టర్లు అధికారులు, సిబ్బందులు పాల్గొన్నారు.