పెద్దవంగర మే 5(జనం సాక్షి )తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్ అన్నారు.శుక్రవారం, మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మె శిబిరాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పెద్ద వంగర మండల శాఖ ఆధ్వర్యంలో సంఘీభావం తెలపడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సోమరపు ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల ద్వారా ఎంపిక కాబడిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను మూడు సంవత్సరముల తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది. అయినప్పటికీ నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రాష్ట్రవ్యాప్తంగా నేటి వరకు కూడా రెగ్యులరైజ్ చేయకపోవడం శోచనీయమని, వారిని వెంటనే ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని కోరారు .ఈ నిరవధిక సమ్మెను జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ మండల అధ్యక్షులు చిక్కాల సతీష్ మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు టైం స్కేల్స్ తో పాటుగా, కారుణ్య నియామకాలు మరియు సెలవు నిబంధనలు మొదలైన సౌకర్యాలను కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ నాయకులు దారావత్ దేవేందర్ గారు, కార్యదర్శులు వెంకన్న,పరమేశ్వర్,సురేందర్, తదితరులు పాల్గొనడం జరిగింది.




