: శామీర్ పేట్, జనం సాక్షిటీఆర్ఎస్ నాయకుని పుట్టిన రోజు ను పురస్కరించుకుని కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి,బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు ప్రేమ్ రాజ్ జన్మ దినం సందర్భంగా అఫ్జల్ ఖాన్ తన నివాసంలో ప్రేమ్ రాజ్ కు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. పార్టీ లో చురుగ్గా పాల్గొంటున్న ప్రేమ్ రాజ్ కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అన్నారు.ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అఫ్జల్ ఖాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, అశోక్ గౌడ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.




