మెట్పల్లి టౌన్, ఏప్రిల్ 29,జనంసాక్షి :ఆకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుట్ల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష మెట్ పల్లి పట్టణంలో పాత బస్టాండ్ వద్ద నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, బిజెపి పట్టణాధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు పైడిపెల్లి సత్యనారాయణ, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ మాట్లాడుతూ ఆకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలి మామిడి మరియు జామ రైతులకు ఎకరాకు 80000 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి వరి, మొక్కజొన్న, నువ్వు, సజ్జ రైతులకు ఎకరాకు 50 వేల నష్టపరిహారం చెల్లించాలి అని అన్నారు. ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే మాఫీ చేయాలి అని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి ఇల్లెందుల శ్రీనివాస్,జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు కోడిపెళ్లి గోపాల్ రెడ్డి ధోనికేల నవీన్, సొరపాక రమేష్, యాదగిరి బాబు, రైతు నాయకులు మామిడి నారాయణ రెడ్డి, గురిజెల రాజారెడ్డి, బద్ధం శ్రీనివాస్ రెడ్డి, రాజ్పల్ రెడ్డి, ముద్దం సత్యనారాయణ,సర్పచ్ లు ఎంపీటీసీ లు తుకారాం గౌడ్, భోగ గంగాధర్,మంచాల శివ, శ్రీనివాస్, రాజేందర్,మారు జనార్దన్ రెడ్డి,రాజు,జిల్లా కిషన్ లోలపు అనిల్,కౌన్సిలర్ చెట్లపల్లి మీనా,దాసరి రాజశేఖర్,మడవేని నరేష్,పెండెం గణేష్,పిసరి నర్సయ్య,తిరుమల్,వాసు, కుడుకుల రఘు,బోడ్ల నగేష్, సుంకేట విజయ్,అధికార ప్రతినిధి బోడ్ల నరేష్,బోడ్ల గౌతమ్, కొయ్యల లక్ష్మణ్,ఆర్మూర్ రంజిత్, కలికోట శ్రీకాంత్, బత్తుల శ్రీను,లావణ్య,
వరలక్మి,పోతుగంటి శ్రీనివాస్, సడిగే మహేష్,యమా వినోద్ తదితరులు పాల్గొన్నారు




