జూన్‌లో వైకుంఠపురం బ్యారేజీ పనులు
– అనుకోని ప్రమాదాలను జగన్ రాజకీయం చేస్తున్నాడు
– జగన్‌కు దమ్ముంటే మోడీని నిలదీయాలి
– ఏపీ మంత్రి దేవినేని ఉమ
విజయవాడ, మే18(జనం సాక్షి ) : ప్రకాశం బ్యారేజికి ఎగువన వైకుంఠపురం బ్యారేజీని నిర్మిస్తామని మంత్రిదేవినేని ఉమమహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. బ్యారేజీ డీపీఆర్ సిద్ధంగా ఉందని, జూన్‌లో పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. జూన్ నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. ఆగస్టులో లక్షమంది రైతులతో గ్యాలరీ వాక్ చేపడతామని తెలిపారు. నవంబర్‌లో గేట్ల నిర్మాణం చేపట్టి మార్చినాటికి పూర్తిచేస్తామని మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. పడవ ప్రమాద ఘటనను సర్కారీ హత్యలనడం జగన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ సొల్లు కబుర్లు చెబుతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ప్రత్యేక ¬దాకోసం ఓ పక్క టీడీపీ కేంద్రంతో తెగదెదింపులు చేసుకొని పోరాడుతుంటే జగన్ చంద్రబాబును తిట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక ¬దా అంటున్న జగన్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదని ప్రశ్నించారు. ఏపీకి అన్యాయం చేసిన మోదీని ప్రశ్నించాలని మంత్రి దేవినేని ఉమ జగన్‌కు సవాల్ విసిరారు. తమ కేసులను మాఫీ చేయించుకొనేందుకు విజయసాయి రెడ్డి, జగన్‌లు కేంద్రం వద్ద ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైన జగన్ తన తీరు మార్చుకోవాలని లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.