Tuesday, 3 November 2026

జూన్ 6న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

 సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి,  జూన్ 5 :-తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 6న (మంగళవారం) జిల్లాలో పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడా ర్లలో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని తెలియజేయడం జరుగుతుందన్నారు. ఇందులో ఐటి ఉద్యోగులు, మీసేవ కేంద్రాల నిర్వహకులు, పరిశ్రమలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. టిహబ్, వి హబ్ లలో కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమావేశాలు నిర్వహిస్తారన్నారు.టి ఎస్ ఐ పాస్ తో పరిశ్రమల స్థాపన, అనుమతుల సులభతరం, జిల్లాకు తరలివచ్చిన పెట్టుబడుల వెల్లువకు సంబంధించిన వివరాలను, తద్వారా పెరిగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలను సమావేశంలో తెలియజేయడంతో పాటు, ఆయా వివరాలతో కూడిన పాంప్లెంట్లు ప్రచురించి అందజేస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.2014 నుంచి 2023 వరకు జిల్లాలో పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడులు, ఉద్యోగ కల్పన కు సంబంధించిన వివరాలు తెలియజేస్తారని తెలిపారు.జిల్లాలోని అన్ని పరిశ్రమలు, మీసేవ కేంద్రాలు, రైస్ మిల్లులు, తదితరాలను సీరియల్ బల్బుల తో అలంకరించి, దశాబ్ది ఉత్సవాల లోగో, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.