Tuesday, 3 November 2026

స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని వినతి

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూన్ 5. (జనంసాక్షి) సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వార్డు సర్దాపూర్ లో స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో యూత్ కాంగ్రెస్ నాయకులు గంభీరావుపేట్ ప్రశాంత్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ గతంలో స్మశాన వాటిక నిర్మాణం కోసం పలుమార్లు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చామని అన్నారు. వీటితోపాటు సర్దాపూర్ లోని పలువురికి ఉపాధి హామీ ద్వారా చెట్లు నాటడంతో పాటు ఇతర పనులు ద్వారా ఉపాధి ఉండేవని ఇప్పుడు ఉపాధి పనులు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ ఇచ్చిన వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు తడగొండ బాలకృష్ణయ్య, సల్లూరి అనిల్, అక్షయ్, అఖిల్ పాల్గొన్నారు.