సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 4 :-తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 5న (సోమవారం)జిల్లాలో తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం జరుపనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణవిద్యుత్ విజయోత్సవం సందర్భంగా జిల్లాలో నియోజకవర్గ స్థాయిలలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి, విద్యుత్ రంగం లో సాధించిన గుణాత్మక మార్పులు వివరిస్తారని కలెక్టర్ తెలిపారు.ఇప్పటికే జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్లు ఇతర విద్యుత్ కార్యాలయాలను సీరియల్ బల్బులతో, పూల ,తోరణాలతో అలంకరించినట్లు తెలిపారు. విద్యుత్ రంగంలో గతంలో పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి, గ్రామంలో ఉన్న మొత్తం కనెక్షన్లు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన కొత్త కనెక్షన్లు, ఉచిత విద్యుత్తుకు వెచ్చించిన నిధుల వివరాలు, రైతులకు జరుగుతున్న మేలు, ఇతర రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తు ఇస్తున్న విషయం, వ్యాపార వ్యవహారాలు సజావుగా నడవడం, గ్రామీణ జీవితంలో వచ్చిన సౌకర్యాలు, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు గురించిన బుక్లెట్ ను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను, సిబ్బందితో సామూహిక భోజనాలు నిర్వహిస్తారని కలెక్టర్ పేర్కొ న్నారు.తెలంగాణ విద్యుత్ విజయోత్సవ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రైతులు ,యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
జూన్,5న తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం . జిల్లా కలెక్టర్ శరత్




