Wednesday, 4 November 2026

జోగిపేటలో ఘనంగా సురక్ష దినోత్సవంపాల్గొన్న ఎమ్మెల్యే

ఆందోల్-జోగిపేట, జ, జనంసాక్షి : జోగిపేట్ ఆందోల్ ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్ లో సురక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం నాడు జోగిపేట సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో దాదాపు 100 మంది యువకులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అభినందనలు తెలిపారు. తర్వాత రక్తదాతలకు బ్లడ్ డోనేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆందోల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ… రక్తదానంతో ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడొచన్నారు. కావున యువకులు బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రావాలని పిలువునిచ్చారు. సురక్ష దినోత్సవం సందర్భంగా దక్తదానం చేసిన యువకులకు సీఐ వెంకటేశం అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వట్పల్లి, పుల్కల్ ఎస్సైలు, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు .. సూపర్డెంట్ రమేష్ డాక్టర్లు బి ఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు