Friday, 6 November 2026

జూలూరుపాడులో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ సంబరాలు

జూలూరుపాడులో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ సంబరాలు

జూలూరుపాడు, డిసెంబర్ 9, జనంసాక్షి: కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా బిఆర్ఎస్ పార్టీని ఆమోదించిన సందర్భంగా మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించిన సందర్భంగా వైరా ఎమ్మెల్యే లావిడియా రాములు నాయక్, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో బిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా కృషి చేస్తామని నాయుకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావిడియా సోనీ, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, ఎంపీటీసీలు దుద్దుకూరి మధుసూదనరావు, పెండ్యాల రాజశేఖర్, నాయకులు లకావత్ గిరిబాబు, మండల ప్రధాన కార్యదర్శి నున్నా రంగారావు, దుద్దుకూరి కృష్ణ ప్రసాద్, నర్వనేని పుల్లారావు, పనితి వెంకటేశ్వర్లు, బానోత్ ధర్మ, ఎస్ కే మైబు, దారావతు రాంబాబు, మోదుగు రామకృష్ణ, ఎల్లంకి చిన్న నాగేశ్వరావు, మాచినేని సత్యనారాయణ, ఎల్లంకి పుల్లయ్య, దేవరకొండ కిరణ్, ఇల్లంగి తిరుపతి, చాపలమడుగు రామ్మూర్తి, తాళ్లూరి రామారావు, మాడుగుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.