Friday, 6 November 2026

వాజిద్నగర్ గ్రామంలో నేటి నుండి ఆరెల్లి మైశమ్మ జాతర

వాజిద్నగర్ గ్రామంలో నేటి నుండి ఆరెల్లి మైశమ్మ జాతర
బిచ్కుంద డిసెంబర్ 09 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలోని వాజిద్నగర్ గ్రామంలో నేటి నుండి ఆరెల్లి మైశమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ అనూయ లక్ష్మీ నారాయణ, ఎంపీటీసీ బీ సాయిలు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం నాడు మైశమ్మ బండ్ల పైన ఊరేగింపు, శనివారం నాడు కుస్తీ పోటీలు, ఆదివారం నాడు పోచమ్మ బండ్ల పైన ఊరేగింపు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కుస్తీ పోటీలలో గెలుపొందిన ఆఖరి విజేతకు ఐదు వేల ఒక్క వంద రూపాయలు బహుమానము అందజేస్తారని తెలియజేశారు.