రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్
కొండమల్లేపల్లి నవంబర్ 15 జనం సాక్షి న్యూస్ :
రైతుల వద్ద నుంచి ధాన్యం తీసుకున్న 48 గంటల్లో ఆయా ఆన్న దాత లకు వారి వారి పంట పైకం వారికి అందేలా..ధాన్యం సేకరణ లో ఉన్న ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.అంతే గాక..
కనీస మద్దతు ధర తో రైతుల వద్ద సేకరించిన ధాన్యం ను ఎప్పటి కప్పుడు దిగుమతి చేసుకోవాలని రఘునందన్ ఆదేశించారు. మంగళ వారం నాడు ఆయన దేవర కొండ లో రైస్ మిల్లును ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సంధర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..ఇప్పటి వరకు ఎన్ని లారీల ధాన్యం దిగుమతి అయ్యింది, అందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పడు నివేదించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సైతం వారికి కేటాయించిన మిల్లులకు మాత్రామే వడ్లు పంపాలని చెప్పారు.
రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ




