– అడ్వాన్స్డ్ కు అర్హత సాధించిన 16మంది విద్యార్ధులు.- అభినందించిన ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి.
ఫొటో : విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపాల్.బెల్లంపల్లి, ఫిబ్రవరి 7, (జనంసాక్షి )
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టిఏ) మంగళవార విడుదల చేసిన జెఈఈ మెయిన్స్ మొదటి సెషన్ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సిఓఈ బెల్లంపల్లి విద్యార్ధులు విజయభేరి మ్రోగించారు. పరీక్షకు హాజరయిన 31మంది విద్యార్ధుల్లో ఏకంగా 16మంది విద్యార్ధులు ఐఐటి అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హతసాధించినట్లు ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు. అర్హత సాధించిన వారిలో సిలివేరు వినయ్ 81.37 పెర్సెంటైల్ తో కళాశాల టాప్ గా నిలువగా వరుసగా ఎనగందుల మౌర్య (74.47 పెర్సెంటైల్, చునర్కర్ అఖిలేశ్వర్ (71.31),తేజావత్ సిద్దు (69.35) విద్యార్థులు తరువాత స్థానాల్లో నిలిచారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్ధులను ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పేరెంట్స్ కమిటీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రతిభ చూపిన విద్యర్థులకు ఫోన్ ద్వారా ఆభినందనలు తెలిపారు. పరీక్ష వ్రాసిన వారిలో సగం మంది అడ్వాన్స్డ్ కు అర్హత సాధించడం అభినందనీయమన్నారు.జనవరి 24 నుండి ఫిబ్రవరి 1 వ తేది వరకు మెయిన్స్-2023 సెషన్ 1 భారతదేశంలోని 290 స్థానాల్లోను, విదేశాల్లోని 25 నగరాల్లో జరిగింది. సుమారు 8లక్షల మంది హాజరయిన ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఉంటుంది, దీనిలో ప్రతిభ చూపిన వారికి దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటి లలో అడ్మీషన్స్ ఇస్తారని ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాలలో జరిగిన ఈ అభినందన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కె.రాజ్ కుమార్, జెవిపి దాసం అజిత, అధ్యాపకులు వర్మ, రమేష్, లక్స్మీనారాయణ, పేరెంట్స్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దాగం మహేష్, రేణికుంట్ల శంకర్, పెరుగు తిరుపతి, ఇప్పరవి, వెంకట స్వామి జాడి, జమ్మి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




