సూర్యాపేట ప్రతినిధి,ఫిబ్రవరి 07 (జనంసాక్షి): జిల్లాలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల కౌన్సిలింగ్ ను పారదర్శకతతో నిర్వహించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వతం సంధ్యారాణి, యామా రమేష్ జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు విజ్ఞప్తి చేశారు.ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల కౌన్సెలింగ్ -2023 నకు సంబంధించిన సీనియారిటీ జాబితాల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా,ఏ ఒక్క ఉపాధ్యాయుడికి అన్యాయం జరగకుండా పారదర్శకతతో నిర్వహించాలని మంగళవారం టిపియుఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు బైరు తిరుమలేష్ , జిల్లా కార్యదర్శి బట్టిపల్లి సాయి కుమార్, జిల్లా మీడియా ఇన్చార్జి పోతుగంటి శ్రీనివాస రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు రేపాల రజని, ఆత్మకూర్(ఎస్) మండల ప్రధాన కార్యదర్శి కోట శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




