డాక్టర్ మహేందర్ రెడ్డిజోగిపేటలోకుష్టి వ్యాధిగ్రస్తులకు దుప్పట్లు మందుల పంపిణీ డాక్టర్ మహేందర్ రెడ్డి
జనం సాక్షిజోగిపేట ఆందోల్: జనవరి అందోల్ జోగిపేట లోని చర్చిలో ప్రభుత్వ,కుష్టు నివారణ అధికారి డాక్టర్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అంగవైకల్యం కలిగిన కుష్టి వ్యాధిగ్రస్తులకు నేస్తం గ్రూప్ సంస్థ ఆర్థిక సహాయంతో వ్యాధిగ్రస్తులకు దుప్పట్లు, మందుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జాతీయ కుష్టు నివారణ వారోత్సవాలను పురస్కరించుకొని జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు నిర్వహించే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎవరికైనా ఒంటిపై స్పర్శ లేని మచ్చలు కాళ్లు చేతులు మొద్దుబారి నట్లు ఉన్నట్లయితే వెంటనే జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని కుష్టు నివారణ కేంద్రం హాస్పిటల్లో వెంటనే పరీక్షలు నిర్వహించుకోవాలని తెలిపారు. కుష్టి వ్యాధి సోకిన వ్యక్తులు భయపడాల్సిన అవసరం లేదని ప్రస్తుతం ఏం డి టి మందుల పంపిణీ వల్ల చికిత్స వ్యాధిగ్రస్తులు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ మహేందర్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక చర్చ్ ఫాదర్ ప్లారిన్స్, నేస్తం గ్రూప్ సభ్యులు వెంకటేశ్వర్లు, అంజయ్య ,తులసి ప్రకాష్ రెడ్డి, రిటైర్డ్ కుస్టు నివారణ అధికారి విప్లవ రెడ్డి తో పాటు జిల్లా కుష్టి నివారణ డీపీఎంవోలు ఎస్. ప్రతాప్ గౌడ్ ,మారుతి , లైన్స్ క్లబ్ జోన్ అధ్యక్షులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.




