వీణవంక లో జోడో యాత్ర కు మద్దతు గా జాతీయ జెండా ఆవిష్కరణ
వీణవంక జనవరి 30 (జనం సాక్షి) వీణవంక కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశ సమైక్యత కోసం రాహుల్ గాంధీ గత సెప్టెంబర్ 7న ప్రారంభించిన భారత్ జోడో యాత్ర 145 రోజులు, 75 జిల్లాలు, 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, 12 బహిరంగ సభలు, 4,080 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, కాశ్మీర్ శ్రీనగర్ లోని లాల్ చౌక్ వద్ద రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. జోడో యాత్ర ముగింపు మరియు నేడు పూజ్య మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్, టీపీసీసీ సభ్యులు కర్ర భగవాన్ రెడ్డి,చదువు జైపాల్ రెడ్డి, జున్నుతుల మధుకర్ రెడ్డి,పైడి కుమార్, అడిగిప్పుల సంపత్, యాదగిరి,దిలీప్,అనిల్ రెడ్డి, రవీందర్,ఉపేందర్ రెడ్డి,ప్రసాద్, మోహన్, రెడ్డి,కోమల్ రెడ్డి, రంజిత్, ప్రశాంత్, ఎండీ రజాక్,శ్రీపాల్ రెడ్డి, గట్టయ్య, అజయ్, ఎండీ సలీం తోపాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాలుగోన్నారు




