జోగిపేటలో బీఆర్ఎస్ నేతల సంబరాలు

మునిపల్లి, ఆగష్టు 21, జనంసాక్షి :
అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంటి క్రాంతి కిరణ్ ను ప్రకటించడంతో జోగిపేట మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. జోగిపేట టౌన్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు, కౌన్సిలర్లతో కలిసి ర్యాలీ తీశారు. టపాకాయలు, బనసంచాలు కలుస్తూ సీఎం కేసీఆర్, క్రాంతన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ భారీ నినాదాలు చేశారు