అలంపూర్ జనంసాక్షి (జూన్ 10)అలంపుర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను శనివారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రవి నాయక్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారి పురెంధర్ కుమార్ ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ లు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు .ఉభయ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేయించి శాలువా పూలమాల వేసి మెమోంటో అందజేశారు. అనంతరం వేద పండితులతో తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనం చేయించారు.
జోగులాంబ ఆలయాన్ని దర్శించుకున్న మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రవి నాయక్




